నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఆద్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ బర్రోల్ల అశోక్ సొసైటీ ఆవరణంలో మొక్కలను నాటారు. మొక్కల యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని కోరారు. సొసైటీ ఆవరణంలో సుమారు వంద మొక్కలను నటుతున్నట్లు తెలిపారు.
రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, మాక్లూర్ సొసైటీ పరిదిలో యూరియా ఉందని, ఇంకా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంకటేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, సొసైటీ వైస్ చైర్మన్ గుడారం శేఖర్, డైరెక్టర్లు అశోక్, లంబని హార్జ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్, క్షేత్రసహాయకులు రాజీనాథ్, సిబ్బంది విండో కార్యదర్శి ప్రవీణ్, హెడ్ క్లర్క్ విజయ్ కుమార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన విండో చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES