Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeమానవిఆవనూనెతో….

ఆవనూనెతో….

- Advertisement -

ఆవనూనెతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిని వంటకాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో బహుళఅసంతృప్త, మోనోశాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు.
ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 వంటి సంతృప్త కొవ్వులు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ నూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్‌ చేయడంలో కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆవాల నూనెను అరికాళ్లకు అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆవనూనెతో అరికాళ్లలో మసాజ్‌ చేసుకోవడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నడిచే వారు, నిలబడి పనిచేసే వారు రాత్రుళ్లు పడుకునే ముందు ఆవాల నూనెతో మసాజ్‌ చేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. శరీరం మొత్తం రిలాక్స్‌ అవుతుంది. నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.
నెలసరి సమయంలో మహిళల్లో కనిపించే కడుపు తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలకు ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఆవాల నూనెను అరికాళ్లకు మసాజ్‌ చేసుకోవడం వల్ల పీరియడ్స్‌ క్రాంప్స్‌ నుంచి ఉపశమనం పొందొచ్చు. మానసి ఒత్తిడితో బాధపడేవారు, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఆవ నూనె మసాజ్‌ మేలు చేస్తుంది. గోరువెచ్చని ఆవాల నూనెతో పాదాలను మసాజ్‌ చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad