Monday, May 5, 2025
Homeమానవితాటి ముంజలతో…

తాటి ముంజలతో…

- Advertisement -

వేసవి కాలంలో మాత్రమే లభించే తాటి ముంజలతో తయారుచేసే ఈ కూర రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లేత తాటి ముంజలు కొద్దిగా తీపిగా, మెత్తగా ఉంటాయి. వాటిని మసాలాలతో కలిపి వండటం వల్ల ఒక విభిన్నమైన రుచి వస్తుంది.
కావలసిన పదార్థాలు: తాటి ముంజలు- 10-12, ఉల్లిపాయ – 1 (సన్నగా తరుగుకోవాలి), పచ్చిమిర్చి : 2-3, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీస్పూన్‌, టొమాటో – 1, పసుపు – 1/2 టీస్పూన్‌, కారం- 1 టీస్పూన్‌, ధనియాల పొడి- 1 టీస్పూన్‌, జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్‌, ఆవాలు – 1/2 టీస్పూన్‌, జీలకర్ర – 1/2 టీస్పూన్‌, మినపప్పు – 1/2 టీస్పూన్‌, ఎండు మిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, నూనె – 2 స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, కొత్తిమీర – కొద్దిగా (తరుగు)
తయారీ విధానం: ముందుగా తాటి ముంజలను శుభ్రంగా కడిగి, వాటి పైనున్న పలుచని పొరను తీసేయాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మసాలాను నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. కట్‌ చేసుకున్న తాటి ముంజల ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 10-15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. వేడి వేడిగా అన్నంతో లేదా చపాతీతోనైనా రుచి అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -