రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొత్తప్లలో ఒకప్పుడు’. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
సావిత్రిని లోకల్ రికార్డ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ రామకష్ణ ప్రేమిస్తాడు. ఒక రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది.
రామకష్ణ చాలా ఉత్సాహంగా వెళ్తాడు. కానీ ప్రేమకథ ఇక్కడ షాకింగ్ మలుపు తిరుగుతుంది. అతని జీవితాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఆ క్షణం నుండి ఊహించని మలుపులతో ఒక మిస్టీరియస్ డివైన్ ఎమెంట్ తెరపైకి రావడం చాలా ఆసక్తికరంగా ఉంది. గురుకిరణ్ బతులా రాసిన ఈ కథ ఊహించని థ్ల్రింగ్ అంశాలతో చిత్రానికి ప్రత్యేకమైన ప్లేవర్‌ని తీసుకొచ్చింది. ప్రవీణ పరుచూరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. కీలకమైన పాత్రను కూడా పోషించారు. పాటలను మణి శర్మ స్వరపరిచారు. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.