నవతెలంగాణ-హైదరాబాద్ : వివాహేతర బంధాల మోజులో కొందరు మానవత్వం మరిచి ఘాతుకాలకు పాల్పడటం పరిపాటిగా మారింది. తమ వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారని, ఎలాగైనా తొలగించుకోవాలనే దురుద్దేశంతో ఓ మహిళ..ప్రియుడి భార్య, ఆమె బిడ్డ(ఆరు నెలల పసికందు)పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్, మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన మమత(25)లకు 2019లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్లుగా నగేశ్‌కు అదే గ్రామానికి చెందిన మీసాల సుజాత(40)కు మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నగేశ్ భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సుజాత శనివారం మధ్యాహ్నం సంచిలో కత్తి, కారం డబ్బా, పెట్రోల్ సీసాతో నగేశ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. ఇంట్లో మమత తన చిన్న కుమారుడు అద్విక్‌కు పాలు పడుతుండగా సుజాత ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపైపోసి నిప్పంటించింది. మంటలు వ్యాపించి మమత అగ్నికి ఆహుతవ్వగా..అద్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని హైదరాబాద్ నిలోఫర్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి సీఐ డి.రాజు తెలిపారు.
ప్రియుడి భార్య, కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మహిళ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



