Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యుత్ వైర్లు తెగిపడి మహిళకు తీవ్ర గాయాలు

విద్యుత్ వైర్లు తెగిపడి మహిళకు తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ గాంధారి 
గాంధారి మండలంలోని చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన ఆకిటి భూదవ్వ సోమవారం ఉదయం రోడ్డుపైన వెళుతుండగా విద్యుత్ పోల్ నుండి వైర్లు తెగిపడి ఆమెపై పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చావు బతుకుల మధ్య ఉన్నా ఆమెను గ్రామస్తులు గమనించి కట్టెలతో వైర్లను తొలగించి ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆమెకు ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని  కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -