- Advertisement -
నవతెలంగాణ – బంజారాహిల్స్ : ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ లోని బ్రాడ్ వే సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉమా సాహూ టిఫిన్ చేసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన మహిళను స్థానికుల, బంజారాహిల్స్ ట్రాపిక్ పోలీసులు 108 సాయంతో చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో మహిళ ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



