నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామగిరి మండల పరిధిలోని కల్వచర్ల శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దండగులు హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన రామగిరి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడున్న ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అయితే, మహిళను సిమెంట్ ఇటుకతో దుండగులు బలంగా కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రామగిరి పోలీసులు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లాలో మహిళ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES