నవతెలంగాణ – చండూరు : చండూరు మున్సిపల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ బజారు, ఆరు, ఏడు వార్డులో వారం రోజులు మున్సిపల్ నీళ్ళు రావడం లేదంటూ కాలనీ వాసులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. అసలే వేసవి కాలం కావడంతో అవసరాలకు నీళ్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదంటూ తెలిపారు. మున్సిపల్ నీళ్లు రావడం లేదని చెప్పిన కూడా ఎవరు పట్టించుకోవడంలేదని మహిళలు వాపోయారు. చివరకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. వార్డ్ ఆఫీసర్లు జోక్యంతో ఆరు, ఏడు వార్డులలో నీళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో రావిరాల చందన, ఎర్ర మాధవ్ మణెమ్మ, రావిరాల రాజేశ్వరి, వరలక్ష్మి, వనం సులోచన, పులిపాటి రమణ, రమణ, కరుణ, కళావతి, జయమ్మ, రాపోలు నీరజ, కొండమ్మ, తదితరులు పాల్గొన్నారు.
నీళ్లు రావట్లేదని మహిళల నిరసన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES