టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకురాలు జానకమ్మ
నవతెలంగాణ – మిడ్జిల్
మహిళలు పురుషులతోపాటు అన్ని రంగాలలో రాణించాలని మహిళల హక్కులు, బాధ్యతలు గురించి అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకురాలు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు జానకమ్మ చెప్పారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె నవ తెలంగాణతో మాట్లాడుతూ..జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారని అన్ని రంగాలలో పోటీ పడుతూ అలుపెరుగని పోరాటం చేస్తున్నామని అన్నారు.
ఆడది అబల కాదు సబల అని, ఆదిశక్తి అని నిరూపిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తూ కాలంతో పరిగెడుతూ ఉన్నప్పటికీ ఆడవాళ్లు స్వేచ్ఛాయుత జీవితానికి దూరం అవుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను అమలు పరుస్తూ, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. మహిళ సాధికారత సమానత్వానికి సంబంధించిన అనేక అడ్డంకులు సంస్కృతిక ప్రమాణాలు ఫలితం లింగ అసమానతలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న చాలామంది పురుషులు మహిళలకు అన్యాయం చేసే సామాజిక నిబంధన భంగపరచడానికి వెనుకడుతున్నారని చెప్పారు.
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయిన నేటికీ మహిళలపై అత్యా అత్యాచారాలు కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తులు చేశారు. ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయాలని కోరారు.



