Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశివాజీ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా క‌మిష‌న్ కీల‌క నిర్ణ‌యం

శివాజీ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా క‌మిష‌న్ కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సీనియర్ నటుడు శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తుల గురించి అభ్యంత‌రక‌రంగా మాట్లాడిన‌ విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్రదుమారం చెల‌రేగుతోంది. తాజాగా ఈ వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ విషయాన్ని కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వాడిన పదజాలం, ఆయన ప్రసంగం వెనుక ఉన్న ఉద్దేశాలను విశ్లేషించే బాధ్యతను కమిషన్‌లోని లీగల్ టీమ్‌కు అప్పగించినట్లు ఆమె తెలిపారు.

శివాజీ మాట్లాడిన పూర్తి వీడియో ఫుటేజీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ప్రతి పదాన్ని చట్టపరంగా విశ్లేషిస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ప్రసంగంలో ఆయన వాడిన “దరిద్రపుగొట్టు, సామాన్లు…” వంటి పదజాలం మహిళా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -