Friday, July 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

- Advertisement -
  • – పరకాలలో ఘనంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు
    నవతెలంగాణ -పరకాల 
  • మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళల స్వాలంబన దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. 
  • గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని వెల్లంపల్లి రోడ్ యందు మహాదేవ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పరకాల నియోజకవర్గస్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ లు స్నేహ శబరిష్, డాక్టర్ సత్య శారద తో కలిసి వడ్డీ లేని రుణాలు, బీమా చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి సోలార్ ప్లాంట్లు, ఉచిత బస్సులు ప్రయాణం, పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, బజార్లు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాల్లో ప్రభుత్వం మహిళలకు అవకాశాలు కల్పిస్తుందన్నారు.
  • వెనుకబడిన మహిళలకు చేయూతగా ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.అధికారుల సహకారంతోనే మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో చట్టసభలలో రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు వెల్లడించారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు, పెట్రోల్‌ పంపులు నిర్వాహణ, పాల డైరీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం సమాజం ఆనందంగా ఉంటుందన్నారు. ఆస్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -