డాక్టర్ నళిని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలకు పోషకాహారం తీసుకోకపోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ నళిని చెప్పారు. మహిళలు చిన్నతనం నుంచి వారిని పెంచే విషయంలో చూపించే అశ్రద్ధ నుండే, మహిళలకు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయన్నారు. పోషకాహారం ఇవ్వడం, నచ్చిన పని చేసే విధంగా స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. మహళలపై అధిక పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ‘మహిళలు-ఆరోగ్య సమస్యలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ మహిళలు అధిక పని వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మహిళలకు యూరిన్ ఇన్‌ఫెక్షన్, గర్భసంచి సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలతోపాటు, మానసిక సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. వయస్సు పెరిగే క్రమంలో బాలికలు కౌమర యువతుల, శరీరంలో వచ్చే మార్పులపై అమ్మలు, టీచర్లు అవగాహన కల్పించాలని కోరారు. 40 ఏండ్లపై బడిన మహిళలు పీసీఓడీ సమస్యలు, క్యాల్సియం, థైరాయిడ్ వంటి సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటూ, కుటుంబాలను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సదస్సులో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణ్‌జ్యోతి, మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శులు కెఎన్ ఆశాలత, బుగ్గవీటి సరళ, ఉపాధ్యక్షురాలు టి. జ్యోతి, పి ప్రభావతి, రాష్ట్ర నాయకులు ఎమ్. వినోద, పి. శశికళ, ఎమ్‌డీ షబానా బేగం, బి.అనూరాధ, వై.వరలక్ష్మి, ఎ.శారద తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారం లోపం వల్లనే మహిళలకు ఆరోగ్య సమస్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



