- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా.. న్యూజిలాండ్-భారత్ మధ్య కీలక మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.48 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (63), హర్మన్‌ప్రీత్ కౌర్ (10) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలతో అదరగొట్టారు. వైస్ కెప్టెన్ అయిన స్మతి మంధాన (95 బంతుల్లో 109.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం చేసింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (124 బంతుల్లో 122 పరుగులు చేసింది. 13 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీ చేసింది. ప్రతీకను అమేలియా కెర్ ఔట్ చేసింది.
- Advertisement -