నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఊపులోవున్న సఫారీ టీంకు ఎదురుదెబ్బతగిలింది. ఇండోర్ మైదానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలనా కింగ్(7-18) విజృంభణతో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31)ను ఔట్ చేసిన మేగన్ షట్ తొలి వికెట్ అందించగా.. ఫామ్‌లో ఉన్న తంజిమ్ బ్రిట్స్(6)ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. అక్కడి నుంచి అలనా కింగ్ సఫారీలను దెబ్బకొడుతూ వచ్చింది. తొలుత.. సునే లుస్(6)ను ఔట్ చేసిన తను.. అనెరీ డిర్కెసెన్(5), గత మ్యా్చ్‌లో హాఫ్ సెంచరీ బాదిన మరినే కాప్(0), సినాలో జఫ్తా(29), చ్లో ట్రయాన్(0), నడినే డీక్లెర్క్(14), మసబత క్లాస్(4)లను ఔట్ చేసి.. ఏడో వికెట్ సాధించింది. కింగ్ విజృంభణతో 24 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.
మహిళల వన్డే వరల్డ్ కప్.. 97 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



