నవతెలంగాణ-హైదరాబాద్: మహిళాల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ గువాహటి వేదికగా దక్షణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య తొలి సెమి ఫైనల్ పోరు సాగుతోంది. ఈ రోజు గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు..సఫారీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దక్షణాఫ్రికా ఓపెనర్ల ఆ జట్టుకు శుభారంబాన్ని ఇచ్చారు. వోల్వార్డ్ట్ (169- ఫోర్లు 20, సిక్స్ 4) సెంచరీతో కదంతొక్కాగా, బ్రిట్స్ 45 రన్స్ తో అదరగొట్టింది. కప్పా 42, సీఎల్ ట్రాయన్ 33 పరుగులతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు. మొత్తం ఏడు వికెట్లు నష్టానికి 319 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది సౌతాఫ్రికా. ఇంగ్లాండ్ బౌలర్లు ఎస్కేలే టోన్ 4వికెట్లు తీయగా, ఎల్‌కే బెల్ రెండు, బ్రూట్ ఒక వికెట్ తీశారు.
మహిళాల వన్డే వరల్డ్ కప్: తొలి సెమిఫైనల్‌లో దక్షణాఫ్రికా భారీ స్కోర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



