నవతెలంగాణ-హైదరాబాద్: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత అందరూ వినే ఉంటారు. పశ్చిమాసియాలో యుద్ధ పుణ్యమని గ్యాస్ కొరత కారణంగా మరల పాత కాలంనాటి కట్టెల పొయ్యి దిక్కుకానుంది. కట్టెల పొయ్యితో వాయు కాలుష్యంతో పాటు మహిళాల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని అప్పట్లో సర్కార్ ఢంకా బనాయించింది. కానీ అదే సర్కార్ గ్యాస్ ధరలు పెంచి..ఆనాటి వంటింటి పొయ్యి వంటకమే బాగుంటుందని పరోక్షంగా ప్రచారం చేస్తోంది. కానీ కథ అడ్డం తిరిగింది. పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యికి ఏ డోకలేకున్నా..పట్టణంలోనే అసలైనా తిప్పలు మొదలైయ్యాయి.
13 రోజులకు చేరుకున్న పశ్చిమాసియా యుద్ధ సెగలు..చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సింహాభాగమైనా భారత్ పై అధిక ప్రభావం పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి, కమర్షియల్ సిలిండర్ల సప్లయ్‌కి కోత విధించింది. దీంతో మెట్రోపాలిటన్ సిటీల్లో గ్యాస్ కుండలపై ఆధారపడి వంటలు చేసే హోటల్స్, రెస్టారెంట్స్, వీధి వ్యాపారులు ఆయోమయంలో పడ్డారు. యుద్ధం కారణంగా ఇదే పరిస్థితి నెలకొంటే..తమ వ్యాపారులు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలతో పోలిస్తే హైదరాబాద్ వంటి నగరాల్లో డొమిస్టిక్‌తో పాటు కమర్షియల్ సిలిండర్ల వాడకం ఎక్కువగానే ఉంటుంది. కమర్షియల్ వాడకంలో హోటల్స్, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, హాస్టల్స్ అగ్రభాగంలో ఉంటాయి. దాదాపు సిటీలో వేల సంఖ్యలో హాస్టల్స్ ఉండగా లక్షల సంఖ్యల్లో విద్యార్థులతో పాటు పలు రంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. గ్యాస్ కొరత కారణంగా వీరి పరిస్థితి ఆగోమ్యగోచరం మారింది. సిటీలో ఉన్న వ్యాపారసముదాయలు అధిక గ్యాస్ ఆధారిత వంటకాలకు పుల్ స్టాప్ పెట్టాయి. ఉదయం పూట అందించే అల్పాహారానికి స్వస్తిపలికాయి. మరికొందరు గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై వంటకాలపై సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం తలెత్తిన విపత్కర పరిస్థితిలో నేపథ్యంలో పాతకాలం వంటింల్లు(కట్టెల పొయ్యి) మరోసారి వాడకంలోకి రానుంది.



