Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సమస్యల పరిష్కారం దిశగా పనులు

గ్రామ సమస్యల పరిష్కారం దిశగా పనులు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో తాగునీటి, ఇతర సమస్యలు పరిష్కరించే దిశగా సర్పంచ్ కుంట లింగారెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యలను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించారు. బోర్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీల సరిదిద్దడం, నీటి సరఫరా సమయాల్లో మార్పులు వంటి చర్యల ద్వారా గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా, ఇతర సమస్యలు పరిష్కర చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, గ్రామంలో ఇతర ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారిస్తూ ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వినిపించుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారు. గ్రామ ప్రజలు సర్పంచ్ తీసుకుంటున్న చొరవపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -