Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంయూపీలో విద్యుత్‌ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికుల ప్రదర్శన

యూపీలో విద్యుత్‌ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికుల ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేషనల్‌ కో -ఆర్డినేషన్‌ కమిటీ అఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎస్‌సీసీఓఈఈఈ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో విద్యుత్‌ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీపీఈజేఏసీ చైర్మెన్‌ సాయిబాబా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నందుకు నిరసనగా 184 రోజుల నుంచి అక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యూపీ విద్యుత్‌ ఉద్యోగులకు అండగా దేశంలోని 27 లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఉంటారని చెప్పారు. కన్వీనర్‌ రత్నాకర్‌రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు ఈ ఆందోళనల్లో భాగస్వామలు అవుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో యూపీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే అక్కడి ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేసి విధంగా ఉద్యోగాల నుంచి తొలగించే చర్యలకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణం మార్చుకోవాలనీ, లేకుంటే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శనలో జేఏసీ నాయకులు బీసీ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, గోవర్ధన్‌, మోసెస్‌, శ్రీనివాస్‌, సదానందం, భూపాల్‌రెడ్డి, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad