- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: గ్రీస్‌లో కార్మిక చట్ట సవరణలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షిఫ్ట్ పని గంటలను 13కు పెంచే ప్రతిపాదనపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా రవాణా, పాఠశాలలు, కోర్టులు, ఆసుపత్రులు వంటి సేవలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గ్రీస్‌లో కనిష్ఠ వేతనం నెలకు 880 యూరోలు మాత్రమే ఉండగా, పనిగంటలు ఎక్కువగా ఉన్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది అసాధారణ పరిస్థితుల్లోనే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
- Advertisement -