ఇజ్రాయిల్‌లో ఏ కూటమికీ లభించని మెజారిటీ
అరబ్ పార్టీల మద్దతే కీలకం
దేశాధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్
టెల్ అవీవ్ : ఓ వైపు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర పరాభవం ఎదురవగా మరోవైపు ఆయన మిత్రుడు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైతం స్వదేశంలో రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయిల్ కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) వెల్లడించిన తాజా ఫలితాల ప్రకారం నెతన్యాహూ నేతృత్వంలోని అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 61 స్థానాలు అవసరం కాగా నెతన్యాహూ నాయకత్వం లోని లికుడ్ పార్టీకి, దాని మిత్రపక్షాలకు కలిపి కేవలం 53 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ కూటమిలో లికుడ్ పార్టీ 27 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్ప టికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలాన్ని సాధించలేకపోయింది. ఇక సైనిక దళాల మాజీ అధిపతి గాడి ఐసెన్‌కోట్ నేత త్వంలోని ప్రతిపక్ష కూటమి అధికార కూటమికి గట్టి పోటీ ఇచ్చి 48 సీట్లు గెలుచుకుంది. వీటిలో ఐసెన్‌కోట్ నాయకత్వం లోని యాషర్ పార్టీ 21 స్థానాలు సాధించింది. నిబంధనల ప్రకారం అత్యధిక ఓట్లు సాధించిన కూటమిగా అవతరించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకే తొలి అవకాశం ఇవ్వాలని ఐసెన్‌కోట్ వర్గం డిమాండ్ చేస్తోంది.
కింగ్ మేకర్‌గా అరబ్ ముస్లింలు
ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాని ప్రస్తుత సంక్షోభ సమయంలో అరబ్ ముస్లిం ప్రాతినిధ్య పార్టీలు ‘కింగ్ మేకర్’ పాత్రను పోషించబోతున్నాయి. అరబ్ పార్టీల్లో జాయింట్ లిస్ట్‌కు 11 స్థానాలు, రామ్‌కు 8 స్థానాలు వచ్చాయి. 19 స్థానాలు కలిగిన ఈ కూటమి ఎవరికి మద్దతు ఇస్తుందనే దాని పైనే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మెజారిటీని నిరూపించుకోగలరనే నమ్మకం ఉన్న నేతను ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఒకవేళ నెత న్యాహూ కానీ, ఐసెన్‌కోట్ కానీ ఇతర పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమై 61 మంది ఎంపీల మద్దతు చూపించలేకపోతే దేశంలో మరోసారి రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అలాంటప్పుడు నెతన్యాహూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. దేశంలో తిరిగి ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఐసెన్కోట్కే మద్దతు : ప్రధాన ప్రతిపక్ష నేతలు
అరబ్ పార్టీలు ఓట్ల చోరీకి పాల్పడ్డా యంటూ నెతన్యాహూ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఆరోపణ లకు నెతన్యాహూ కానీ, ఆయన మద్దతుదా రులు కానీ ఎలాంటి ఆధారాలు చూపలేక పోయాయని తెలిపింది. ఇదిలావుండగా ప్రభుత్వ ఏర్పాటులో ఐసెన్కోట్కు మద్దతు ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతలు అంగీకరించారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నెతన్యాహూ ప్రభుత్వాన్ని సాగనం పాలని వారు అభిప్రాయపడ్డారు. ‘జాతీయ అత్యవసర ప్రభుత్వం’ ఏర్పడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతలు మంగళ వారం తొలిసారిగా సమావేశమయ్యారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై అధ్యక్షుడు హెర్జోగ్ వివిధ పార్టీలతో బుధవారం సంప్రదింపులు ప్రారంభించారు. అరబ్ పార్టీలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నెతన్యాహూ సుముఖంగా లేరు. మరోవైపు ఐసెన్‌కోట్ ప్రతిపాదించిన నాలుగు సూత్రాలను కొన్ని అరబ్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.






కామెంట్లు (0)