Magazines

కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు?

38 నిమిషాల క్రితం

When will new pensions be sanctioned?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

పింఛన్ల కోసం 
రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

నవంబర్ 13న జిల్లా కేంద్రాల్లో దీక్షలు, 27న సెర్ప్ కార్యాలయం ముట్టడి

పెల్లెట్ గన్స్ నిషేధం కోసం ఉద్యమం : ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
యం.అడివయ్య

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పెల్లెట్ గన్స్ వినియోగం - అనర్థాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ 18,19 శతబ్దాలలో పక్షుల వేట కోసం పెల్లెట్ గన్స్ వినియోగించే వారనీ,20 వ శతబ్దం నుంచిమనుషులపై వినియోగిస్తున్నారని తెలిపారు. పెల్లెట్ గన్స్ వినియోగించడంతో ఆంధత్వం, కంటి చూపు కోల్పోవడం, శారీరక అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. బహ్రెయిన్, ఈజిఫ్ట్ దేశాల్లో పెల్లెట్ గన్స్ వాడడంతో వేలాది మంది చనిపోయారని చెప్పారు. దక్షిణాఫ్రికా దేశంలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పెల్లెట్ గన్స్ వాడకంతో వేలాది మంది గాయల పాలయ్యారని తెలిపారు. దేశంలో జమ్మూ కాశ్మీర్ లో పెల్లెట్ గన్స్ వినియోగించి మానవ హక్కులను ఉల్లంఘించారని విమర్శించారు. 2016-17 సంవత్సరంలో పెల్లెట్ గన్స్ కు ప్రత్యామ్నాయ ఆయుధాల ఉపయోగించడంపై కేంద్ర ప్రభుత్వం 2016 జులై 26న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. 2017 లో స్టన్ గ్రేనేడ్స్, టియర్ గ్యాస్, పిఏవిఏ షెల్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను వాడాలని కేంద్ర హోం శాఖ వెల్లడించిందని గుర్తుచేశారు. కానీ అవసరాన్ని బట్టి పెల్లెట్ గన్స్ ఉపయోగించవచ్చునని పేర్కొనడం కేంద్ర ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమని విమర్శించారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించి 2016 వికలాంగుల హక్కుల చట్టం, 2007 ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని తప్పుపట్టారు. సమాజంలో వికలాంగులకు సమాన అవకాశాలు,గౌరవ ప్రధమైన జీవనం కల్పించడం, ఎలాంటి వివక్షత లేకుండా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెల్లెట్ గన్స్ నిషేదించాలని దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి మూడు సార్లు లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందని తెలిపారు .జూన్ 2, ఆగష్టు 15, దసరా నాడు కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కొత్తగా 5,98,193మంది దరఖాస్తు చేసుకున్నారనీ, విరిలో 1,48,882 మంది వికలాంగులున్నారని తెలిపారు. జిల్లాలో రీవెరిఫికేషన్ పేరుతో చేసిన సర్వేలు పూర్తి అయినా కొత్త పెన్షన్స్ ఎందుకు మంజూరు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కొత్త పెన్షన్స్ మంజూరు కోసం నవంబర్ 13న జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 27 నాడు సెర్ప్ కార్యాలయం ముట్టడిస్తున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, యశోద, కాశప్ప, సహాయ కార్యదర్శులు జె.రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గ, జయలక్ష్మి బంగారయ్య, భుజంగా రెడ్డి, మల్లేష్, లలిత, బాబు, షాహిన్ బేగం, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు

​

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్