Magazines

దిగొచ్చిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం

15 నిమిషాల క్రితం

French government backs down
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

కనీస వేతనాలు పెంపు

పారిస్‌ : పెరుగుతున్న జీవనవ్యయంపై ఫ్రాన్స్‌లో వెల్లువెత్తుతున్న ఆందళనలు, నిరసనలు, సార్వత్రిక సమ్మెలకు ప్రభుత్వం తలవంచింది. కనీస వేతనాల పెంపుదలను నెల రోజుల ముందుగానే అమలు చేస్తానని ప్రకటించింది. ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్నూ సోమవారం ఒక ప్రకటన చేస్తూ కనీస వేతనాలను 1.6 శాతం మేర పెంచుతున్నట్లు తెలిపారు.

వాస్తవానికి వచ్చే ఏడాది ప్రారంభంలో వేతనాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే తాజా నిర్ణయంతో వేతన పెరుగుదల డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. విద్యార్థులు, కార్మిక సంఘాలు, ఉపాధ్యా యుల నేతృత్వంలో కొన్ని వారాలుగా కొన సాగుతున్న నిరసనల నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిధులు కేటా యించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లతో మొదలైన ఆందోళనలు ఆ తర్వాత తీవ్ర స్థాయి నిరసనలుగా మారాయి. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పింది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో కనీస వేతనం 1,656 డాలర్లుగా ఉండగా వచ్చే నెల నుంచి 1,683 డాలర్లకు పెరుగుతుంది. గత 20 సంవత్సరాల కాలంలో ఇది రెండవ అతి పెద్ద పెంపుదల అని, కాబట్టి దీనిని తక్కువగా చూడవద్దని ప్రధాని కోరారు. ఉద్యోగాల కోతకు దారితీయకుండా చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఈ విధానాన్ని రూపొందిం చామని తెలిపారు.

కాగా ఫ్రాన్స్‌లో చివరిసారిగా జూన్‌లో వేతనాలు పెంచారు. అప్పట్లో ద్రవ్యోల్బణం కారణంగా కనీస వేతనాలను 39 డాలర్లు పెంచారు. అయితే ప్రస్తుత వేతనాలు ఇప్పటికీ కార్మిక సంఘాల డిమాండ్లకు అనుగుణంగా లేవు.

దేశంలో అతి పెద్ద కార్మిక సంఘమైన సీఎఫ్‌డీటీ కనీన వేతనాలను 112 డాలర్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తోంది. వామపక్ష కార్మిక సంఘమైన సీజీటీ కనీస వేతనాలను 168 డాలర్లకు పెంచాలని పట్టుపడుతోంది.

ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉండడంతో దేశంలో పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తతల పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్