- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2026) శుక్రవారం నాడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఛాంపియన్ టీమ్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ముంబై జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు (2023, 25), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి (2024) టైటిల్ గెలుచుకున్నాయి.
- Advertisement -



