Thursday, May 8, 2025
Homeమానవిఇలా చేద్దాం…

ఇలా చేద్దాం…

- Advertisement -

కొంతమందికి చిన్నతనంలోనే ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటాయి. దీంతో చిన్న వయస్సులోనే వద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మరి ఈ సమస్యను నివారించుకోడానికి పౌష్టికాహారం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు.
టొమాటోలో ఉండే లైకోపీన్‌ సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మానికి మెరుపు వస్తుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే తేనెను ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు, పలు ఫేస్‌ ప్యాక్స్‌లోనూ వాడచ్చు. చర్మానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. దీనివల్ల చర్మం లోలోపలి నుంచి మెరుపు సంతరించుకుంటుంది. చర్మంపై వచ్చే అలర్జీ, దద్దుర్లను తగ్గించడంలోనూ పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్‌ తోడ్పడతాయి.
ఓట్స్‌, గోధుమ, బార్లీ.. వంటి వాటినీ మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు వంటి వద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు నిపుణులు. మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయితే చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే సరిపడినంత నీరు తాగాలి. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించాలంటే మన శరీరంలో నీటిశాతం తగినంత ఉండాలి. కాబట్టి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకుంటే వద్ధాప్య ఛాయలు రాకుండా నివారించుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -