నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈ నెల 25 న జరగబోయే గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భువనగిరి మండలంలోని అనంతారం శివారులో గల వెన్నెల కాలేజీలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తూ ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా , పక్కాగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణ రెడ్డి, కలెక్టరేట్ ఏ ఓ జగన్మోహన్ ప్రసాద్, సంబంధిత అధికారులు ఉన్నారు.
గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ చెయ్యాల: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES