నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన గుర్రం ఉదయ్ కిరణను మండల యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని యాదవ సంఘం నాయకులు ఈ సందర్భంగా ఎస్సైకి వివరించారు. దీనిపై స్పందించిన ఎస్పై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు జంగిల్ సత్తన్న యాదవ్, ఉపసర్పంచ్ నరేష్ యాదవ్, గట్టు మహేష్ యాదవ్, జక్కుల మధుకర్ యాదవ్, కుమ్మం మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. యాదవ సంఘం ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు కూడా హాజరై ఎస్సైకి అభినందనలు తెలిపారు.
జన్నారం ఎస్సైకి యాదవ సంఘం ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



