నవతెలంగాణ-హైదరాబాద్: యెమెన్‌లో తీరంలో ఆఫ్రికన్ వలసదారుల పడవ బోల్తాపడిన ఘటనలో 56మంది మరణించగా, 132మంది గల్లంతైనట్లు యుఎన్ ఇమ్మిగ్రేషన్ ఏజన్సీ పేర్కొంది. యెమెన్ తీరంలో ఆదివారం పడవబోల్తా పడిన ఘటనలో 68మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా, 74మంది గల్లంతైనట్లు యుఎన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున యెమెన్ దక్షిణ ప్రావిన్స్ అబ్యాన్‌లోని తీరప్రాంత నగరమైన షుక్రా సమీపంలో పడవ మునిగే సమయంలో అందులో మొత్తం 200మంది వలసదారులు ఉన్నారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఒఎం) ఒక ప్రకటనలో తెలిపింది.
మంగళవారం ఉదయం నాటికి 14 మంది మహిళలు సహా 56 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజన్సీ పేర్కొంది. 12మంది పురుషులను రక్షించినట్లు తెలిపింది. ఈ హృదయ విదారక ఘటన తూర్పు ప్రాంతంలో అక్రమ వలసల ప్రమాదాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుందని ఐఒఎం తెలిపింది.