Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుయోగ నిత్యజీవితంలో భాగం కావాలి

యోగ నిత్యజీవితంలో భాగం కావాలి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అధ్యక్షులు డా.జగన్ మోహన్ సమన్వయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రధానాచార్యులు డా. కె. ప్రభు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానాచార్యులు ప్రభు మాట్లాడుతూ ….. “చిత్తవృత్తి నిరోధః యోగ ” అని, మనసును, శరీరాన్ని ఏకం చేసేది యోగ అని అన్నారు. విద్యార్థులు యోగాను నిత్యం పాటించడం ద్వారా ఏకాగ్రతను సాధించి, విద్యారంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని, యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించి అధికారికంగా 174 దేశాలు యోగా దినోత్సవాన్ని ఇవాళ పాటిస్తున్నాయని, అది భారతీయుల యొక్క గొప్పతనం అని అన్నారు. యోగ ద్వారా మనం నిశ్చలత్వాన్ని పొంది శాంతియుతమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సాధించవచ్చని, యోగ ప్రజలకు నిత్యజీవితంలో భాగం కావాలని అన్నారు.యోగ శిక్షణా కేంద్రం జూబ్లీహిల్స్ నుండి డాక్టర్ చెంచారావు, యోగ తెరఫీ హబ్ నల్లకుంట నుండి అపర్ణ భూపతి గారు అధ్యాపకులు మరియు విద్యార్థులకు వజ్రాసనం, వృక్షాసనం ,తాడాసనం, పద్మాసనాలతో పాటు ముద్రలను నేర్పించి ధ్యానము చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad