Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో స్థిరపడొచ్చు 

క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో స్థిరపడొచ్చు 

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్  ముత్యాల సునీల్ కుమార్ 
– ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత కమ్మర్ పల్లి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
యువత క్రీడల్లో రాణించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడి పైకి ఎదగవచ్చని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్  ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో యూత్ కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ జిల్లాల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ.. యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడవచ్చు అన్నారు. క్రీడలను కాలక్షేపం కోసం కాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఒక క్రీడను ఎన్నుకొని రాణించేందుకు కృషి చేయాలి అన్నారు. తాను అనుకున్న లక్ష్యసాధన కోసం యువత క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.ఆటల పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. వివిధ టోర్నమెంట్లో పాల్గొనడం ద్వారా కొత్త కొత్త స్నేహితులతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను పక్కనపెట్టి క్రీడస్ఫూర్తిని ప్రదర్శించడమే తమ కర్తవ్యం అనే విషయాన్ని గుర్తెరిగి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

సెలవుల  రోజుల్లో యువతను క్రీడలను ప్రోత్సహించేందుకు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ జిల్లాల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన మండల యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన కమ్మర్ పల్లి జట్టుకు కప్పుతో పాటు రూ.8వేల నగదును, రన్నర్ గా నిలిచిన కోరుట్ల జట్టుకు కప్పుతోపాటు రూ.6వేల నగదును  అందజేశారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులను ఆయన అభినందించారు.   కార్యక్రమాలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి  దేవేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు బద్దం రాజేశ్వర్ రెడ్డి, బోనగిరి లక్ష్మణ్, అవారీ సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మెండే నరేందర్, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -