Saturday, September 27, 2025
E-PAPER
Homeకవితకవిత్వమై కనిపిస్తున్నావు..!

కవిత్వమై కనిపిస్తున్నావు..!

- Advertisement -

నా బతుకంతా
మానవతకు మెతుకని
నా తెలంగాణ తోవలో
జనం’గొడవని’..
గట్టిగా అక్షర గర్జనై వినిపిస్తివి..!
నీ గుండె శబ్దము
అసమానతల అజ్ఞాన
బతుకుల పాలిట
సమరవాదమై ప్రతిధ్వనిస్తున్నది..!
అన్యాయ పోకడలపై
నిజాం నిరంకుశత్వంపై
నిటారుగా నిలబడి
మన యాసతో..
భాషా పరిమళంతో
అక్షర రణనినాదమై
ప్రశ్నించే జ్ఞానరవి అయితివి..!
ఏ మనిసి సమస్యలతో బాధ పడిన
మతాల చదరంగాన
కుల రాజకీయ రంగాన
అణగదొక్కాలని
ఎవరైనా చూసిన..
అగ్ని పర్వతమై అక్కడుంటవు..!
అందరికీ ఆపద్భాందవుడవైతవు.!
అహింసే అనుసరణీయమని
సత్యాగ్రహం ఆచరిస్తివి..!
ఉద్యమాల విప్లవాల జనసంద్రంలో
‘జైతెలంగాణ’కు ఊపిరిపోస్తివి..!
నా దేశ జాతీయ పతాకం సాక్షి గా
‘పద్మవిభూషణుడిగా’ ప్రభవిస్తుంటివి..!
మా మదిలో..ఈ గడ్డ యాదిలో..
పలు భాషల పరిజ్ఞాన
పాండిత్యపు బతుకమ్మతో
‘తెలంగాణ భాషా దినోత్సవమై’
కలంతో..గళంతో
కవిత్వమై కనిపిస్తున్నవు..!
కనిపిస్తూనే వుంటవు..!
(సెప్టెంబర్‌ 9, కాళోజీ నారాయణరావు జయంతి,
తెలంగాణ భాషా దినోత్సవము సందర్భంగా…)

ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -