Thursday, June 19, 2025
E-PAPER
Homeసినిమా'కుబేర' లాంటి సినిమాని చూసి ఉండరు

‘కుబేర’ లాంటి సినిమాని చూసి ఉండరు

- Advertisement -

‘తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్‌.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్‌.. వారి మధ్య జరిగే కాన్‌ఫ్లిక్టే ‘కుబేర’.
ఈ కాన్‌ఫ్లిక్ట్‌ ఎలా ఉంటుందనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు.
ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్‌ కమ్ముల కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌ఎల్‌విసీ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌, హై ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో నిర్మించారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘కుబేర’ తీయడానికి మోటివేషన్‌ అంటూ ఏం లేదు. కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్‌ లైన్‌ అనిపించింది. ఒక సూపర్‌ రిచ్‌ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్‌ వర్సెస్‌ బెగ్గర్‌.. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్‌. అది మెల్లగా ఒక ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తయారైంది.
ఈమధ్యకాలంలో చాలా సినిమాలు, కథలు వస్తున్నాయి. కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్‌గా చెప్పబడాలి. ఈ కథ అవేర్‌నెస్‌ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్‌ పాయింట్‌. సినిమాని తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ చేశాం. కథాపరంగా ఎలాంటి మార్పు ఉండదు. కానీ లెంత్‌లో ఒక నిమిషం తేడా ఉంటుంది. లిప్‌ సింక్‌ పరంగా ప్రతీది విడివిడిగా తీశాం. టెక్నికల్‌గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింది.
కొన్ని షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ నాగార్జున చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి ఆయన పర్ఫెక్ట్‌ యాప్ట్‌. ఆయనని స్క్రీన్‌ మీద చూసినప్పుడు ఒక వావ్‌ ఫ్యాక్టర్‌ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని వేరే విధమైన యాక్టింగ్‌, మేనరిజమ్స్‌తో క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చూపించాను. ‘మనం, ఊపిరి’ ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్‌ వేరియేషన్‌ ఉన్న క్యారెక్టర్స్‌ని నాగ్‌ చేశారు. ఈ సినిమాలో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్‌లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు. రష్మిక కూడా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్‌ లెవెల్‌లో నటించే హీరోయిన్‌ తను. ఇక ‘కుబేర’ పాత్రని ధనుష్‌ తప్పితే ఎవరూ చేయలేరు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట చెబుతారు. అంతా అద్భుతంగా నటించారు. ఆ క్యారెక్టర్‌లో ఇంక ఎవరినీ ఊహించలేరు. జిమ్‌ షర్బ్‌ నన్ను చాలా సర్ప్రైజ్‌ చేశారు. ఎంత పెద్ద డైలాగ్‌ అయినా నేర్చుకునేవారు.
నిజానికి నా మీద ఒక మార్క్‌ పడింది. కానీ నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్‌బస్టర్‌ అయిన సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌, లవ్‌ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది. ‘కుబేర’ కథకు కావలసింది చేశాను. మార్క్‌ అనేది కథ ప్రకారం ఉంటుంది. అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్‌ ఫ్యాక్టర్‌ ఈ సినిమా చూసినప్పుడు ఆడియన్స్‌లో ఉంటుంది.
దేవిశ్రీ ప్రసాద్‌తో జర్నీ సూపర్‌గా ఉంది. కమర్షియల్‌గా ఆయన కింగ్‌. దీనికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. హై ఇచ్చే చాలా మూమెంట్స్‌ ఉన్నాయి. మ్యూజిక్‌ చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఇంత పెద్ద స్టార్‌ కాస్ట్‌, పెద్ద బడ్జెట్‌ నిర్మాతల వల్లే సాధ్యమైంది. నేను ఏమి అడిగినా అది కాదనకుండా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -