Monday, February 9, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ బరిలో ‘నువ్వా - నేనా’

మున్సిపల్ బరిలో ‘నువ్వా – నేనా’

- Advertisement -

– ప్రముఖుల పోటాపోటీ తో అశ్వారావుపేట లో వేడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికలు హాట్‌టాపిక్‌ గా మారాయి.మొత్తం 22 వార్డులకు 178 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ప్రతి వార్డు లోనూ ఉత్కంఠ నెలకొంది. మాజీ ప్రజాప్రతినిధులు,రాజకీయ అనుభవజ్ఞులు,వ్యాపారులు,వృత్తి నిపుణులు,కొత్త ముఖాలు ఇలా విభిన్న వర్గాల అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఈసారి ఎన్నికలు “నువ్వా – నేనా” అనే స్థాయిలో సాగుతున్నాయి.

సాధారణంగా ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో ఒకే ప్రాంతం, ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా తలపడటం కనిపిస్తుంటే, అశ్వారావుపేట లో మాత్రం అనుభవిజ్ఞులు – కొత్త వారూ సమానంగా బరిలోకి రావడం విశేషం.పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మరోసారి అదృష్టం పరీక్షించు కుంటుండగా, రాజకీయాలకు కొత్తగా అడుగుపెడుతున్న అభ్యర్థులు కూడా తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాన వార్డుల్లో ఆసక్తికర పోటీ

3 వ వార్డు (బీసీ – జనరల్)లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయుడు సూర్యప్రకాశ్ రావు (బీఆర్ఎస్) సహా నలుగురు పోటీ పడుతున్నారు.
4 వ వార్డు (బీసీ – మహిళ)లో కాంగ్రెస్ రెబల్ వేముల భారతి ప్రతాప్ స్వతంత్రంగా బరిలో ఉండగా, సీపీఐ (ఎం) జిల్లా నాయకులు చిరంజీవి కూతురు కట్టా సింధూజ కాంగ్రెస్ టికెట్‌ పై పోటీ చేస్తున్నారు.
6 వ వార్డు (అన్‌రిజర్వడ్ – మహిళ)లో కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి జూపల్లి శశికళ కు రాజకీయాలకు కొత్త ముఖం అయిన బీఆర్ఎస్ అభ్యర్థినిగా మాధురి భాయి సవాల్ విసురుతున్నారు.
7 వ వార్డు (ఎస్సీ –  జనరల్)లో టీఆర్ఎస్ అభ్యర్థి కొల్లి రవికిరణ్,కాంగ్రెస్ అభ్యర్థి బూసి పాండురంగ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.వీరు ఇరువురు గతంలో అశ్వారావుపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ లు పోటీ పడ్డారు.సీపీఐ(ఎం) నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పై ఓడిపోయారు.
8 వ వార్డు (జనరల్ –  మహిళ)లో రాజకీయాలకు కొత్త ముఖం అయిన కాంగ్రెస్ అభ్యర్థి రెహానా షేక్, బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని నాగశేషపద్మ లు తలపడటం గమనార్హం.
10 వ వార్డు లో కాంగ్రెస్ మిండ హరిబాబు, బీఆర్ఎస్ కోటగిరి హరి జగన్నాథ్ కిశోర్ మధ్య ప్రధాన పోటీతో పాటు మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
11 వ వార్డు లో కాంగ్రెస్ నార్లపాటి మహేష్ బాబు, బీఆర్ఎస్ తగరం జగన్నాధం మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
12 వ వార్డు (ఎస్టీ – మహిళ)లో మాజీ సర్పంచ్ అట్టం రమ్య (కాంగ్రెస్), బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్లావత్ లక్ష్మి మధ్య నేరుగా పోటీ ఉంది.
13 వ వార్డు లో కాంగ్రెస్ జూపల్లి రమేష్ బాబు—మున్సిపాలిటీ తొలి చైర్మన్ పదవి లక్ష్యంగా బరిలో నిలిచిన నాయకుడు – బీఆర్ఎస్ అభ్యర్థి సంకుల స్వరూప రాణి తో తలపడుతున్నారు.
14 వ వార్డు లో మాజీ పాలకవర్గ సభ్యుడు కండ్రకోట ఉదయ్ కుమార్ (కాంగ్రెస్), ప్రముఖ వైద్యురాలు భూక్యా ఉదయ్ జ్యోతి (బీఆర్ఎస్) మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
16 వ వార్డు (జనరల్ – మహిళ)లో సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞురాలు, అశ్వారావుపేట మేజర్ పంచాయతీ పాలకవర్గం సభ్యురాలు దండాబత్తుల ఆదిలక్ష్మి (కాంగ్రెస్), బీఆర్ఎస్ సత్యవరపు ప్రసన్న లక్ష్మి మధ్య పోటీ కొనసాగుతోంది.
18 వ వార్డు లో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు తిరుమలశెట్టి వెంకన్న బాబు (కాంగ్రెస్), బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయాలకు కొత్త ముఖం శెట్టిపల్లి రఘురాం మధ్య ప్రధాన పోటీ ఉంది.
19 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, బీఆర్ఎస్ అభ్యర్థి గా తెలుగు దేశం పార్టీ నాయకుడు నార్లపాటి శ్రీనివాస్ రావు,సీపీఐ అభ్యర్థి తిర్నాటి సంజయ్ మధ్య త్రికోణ పోటీ కనిపిస్తోంది.
21 వ వార్డు (ఎస్సీ – మహిళ)లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల, బీఆర్ఎస్ వెలేటి పార్వతి మధ్య పోటీ నెలకొంది.
22 వ వార్డు (ఎస్సీ – జనరల్)లో కాంగ్రెస్ అభ్యర్థి గా రాజకీయాలకు కొత్త ముఖం నార్లపాటి దివాకర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి జుజ్జూరపు శ్రీరామమూర్తి తలపడుతున్నారు 
మొత్తం మీద చూస్తే, అనుభవజ్ఞుల ప్రభావం, రాజకీయ వారసత్వం, కొత్త ముఖాల సవాల్ – ఇవి అన్నీ కలిసి వచ్చి అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికలను అత్యంత ఉత్కంఠభరితంగా మార్చాయి. ప్రతి వార్డు లోనూ చివరి వరకు ఫలితాలపై అనిశ్చితి నెలకొనే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -