Wednesday, October 29, 2025
E-PAPER
Homeజాతీయంకాకినాడ సముద్రంలో యువ మత్స్యకారుడు గల్లంతు

కాకినాడ సముద్రంలో యువ మత్స్యకారుడు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ నగరం దుమ్ములపేటకు చెందిన గద్దేపల్లి సాయిరామ్‌ (21) అనే యువకుడు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుంభాభిషేకం రేవు వద్ద నిలుపుదల చేసిన బోట్లను తాళ్లతో కట్టేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో … సముద్రంలో ఆ యువకుడు గల్లంతయ్యాడు. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గల్లంతయిన యువకుడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బుధవారం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ , ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొన్నారు. బోట్లపై వెళ్లి వలలు వేసి ఎన్‌ డీ ఆర్‌ ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. బుధవారం ఉదయం నుండి కూడా రెండు బృందాలు గాలిస్తున్నప్పటికీ సాయంత్రం వరకు మత్స్యకార యువకుడికి సంబంధించిన ఆధారాలు లభించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -