Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కనకయ్య కుమారుడు జానీ (21), తాను కోరుకున్న బీఎండబ్ల్యు కారును తండ్రి కొనివ్వలేదన్న మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం జానీ బీఎండబ్ల్యు కారు కావాలని తండ్రిని అడిగాడు. అయితే అంత డబ్బు తన వద్ద లేదని, బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య తెలిపాడు. ఈ క్రమంలో తండ్రి కొద్దిరోజుల క్రితం కుమారుడిని సిద్దిపేటలోని ఓ కార్ షోరూమ్‌కు తీసుకువెళ్లి స్విఫ్ట్ కారును చూపించాడు. అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేశాడు.

తను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్‌వీఎమ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జానీ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad