- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనారోగ్య కారణాలతో ఓ యువకుడు 16వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్‌స్పెక్టర్ రమేష్‌నాయక్‌ల కథనం ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన నీలి ప్రవీణ్(30) మూడేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతడి మతిస్థిమితం కూడా సరిగాలేదు. ఈ క్రమంలోనే షేక్‌పేట నాలా వద్దఉన్న ఆదిత్యా ఎంప్రెస్ టవర్స్‌లోని 16వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం ప్రవీణ్ ఆ టవర్స్ పక్కనే ఉన్న పాస్‌పోర్టు కార్యాలయంలో పని చేశాడని, ఆ కారణంగానే ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -



