Saturday, May 17, 2025
Homeతాజా వార్తలువిషాదం..విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

విషాదం..విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాచలం పట్టణంలో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. వంశీ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. వాజేడు మండలానికి చెందిన వంశీ, ప్రస్తుతం సామ్రాట్ రెసిడెన్సీ పక్కన అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. భద్రాచలంలోని దేవరాజ్ హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం విద్యుత్ తీగలు చేతికి తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ముద్ద పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల తిరుపతిరావు సహా పలువురు ధర్నాకు దిగారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి సీఐ నాగరాజు చేరుకొని కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -