Friday, May 2, 2025
Homeరాష్ట్రీయంబెట్టింగ్‌కు యువకుడు బలి

బెట్టింగ్‌కు యువకుడు బలి

– అప్పులు చేసిన డబ్బులు పోవడంతో ఆత్మహత్య
– మేడ్చల్‌ జిల్లా గౌడవెల్లి గ్రామంలో ఘటన
నవతెలంగాణ- మేడ్చల్‌

బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. అప్పులు చేసి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని గౌడవెళ్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడవెళ్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ యాదగిరి రెండో కుమారుడు రాహుల్‌(24) ఇంటర్‌ వరకు చదివి ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మద్యం తాగడం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడిన అతను కొన్ని రోజులుగా అప్పులు చేసి ఐపీఎల్‌ బెట్టింగ్‌లో పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లోని పైగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img