Friday, February 27, 2026
E-PAPER
Homeక్రైమ్ఆఫీస్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

ఆఫీస్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో గురువారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అనిత (23) అనే యువతి, తాను విధులు నిర్వహిస్తున్న కార్యాలయ భవనం పైనుంచే దూకి ప్రాణాలు తీసుకుంది. సీబీసీఐడీ కాలనీలోని కంపెనీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లికి చెందిన అనిత, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. అయితే, గత కొంతకాలంగా ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, తీవ్ర నిరాశతో భవనం మూడో అంతస్తు నుంచి దూకేసిందని ప్రాథమిక సమాచారం. కిందపడటంతో తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -