- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి(22) ఈ నెల 4న హైదరాబాద్ మీర్ పేట పీఎస్ పరిధిలోని ఓ హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందింది. సరస్వతి, తన గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెంది తమ కూతురు మృతి చెందిందని, ఇందుకు ప్రేమించిన యువకుడే కారణమని ఆరోపిస్తూ మంగళవారం ఆ యువకుడి ఇంటి ఎదుట మృతదేహంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
- Advertisement -



