Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసినీనటి అనసూయపై అసభ్య పోస్టులు..యువకుడి అరెస్ట్

సినీనటి అనసూయపై అసభ్య పోస్టులు..యువకుడి అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నటీమణులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో నకిలీ వీడియోలు సృష్టించడం, అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం వంటి ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు వస్తున్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ కేసులో ఏపీలోని కడప జిల్లా పులివెందులకు చెందిన జనార్దన్‌ను నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తున్న అతడు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అనసూయ నకిలీ వీడియోలను తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -