Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంప‌లు రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ ఆందోళ‌న‌లు

ప‌లు రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ ఆందోళ‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: యూఎస్‌తో ట్రేడ్ డీల్‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ నిర‌స‌న వెనుక భారీ కుట్ర ఉంద‌ని ఇండియ‌న్ యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడైన ఉదయ భాను చిబ్ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ సెక్ష‌న్‌ల కింద కేసు న‌మోదు చేశారు. కేసు వాద‌న‌లో భాగంగా ఆయ‌న‌కు నాలుగు రోజులు పోలీస్ క‌స్ట‌డీ విధించింది పాటియాల కోర్టు. తాజాగా ఆయ‌న అరెస్ట్‌ను ఖండిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో నేష‌న‌ల్ స్టూడెంట్ యూనియ‌న్(NSUI) ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. చిట్ అరెస్ట్ అప్ర‌జాస్వామిక‌మ‌ని, ఆయ‌నను విడుద‌ల చేసేంత వ‌ర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

రాజస్థాన్‌లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం నుంచి స్థానికంగా ఉన్న‌ బీజేపీ హెడ్ క్వార్ట‌ర్స్ వ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. క‌ల‌క‌త్తాలో కూడా చిట్ అరెస్ట్‌ను ఖండిస్తూ నిర‌స‌న చేప‌ట్టారు కాంగ్రెస్ యూత్ శ్రేణులు. త‌మ నాయ‌కుని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయ‌కుంటే..దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వాని హెచ్చ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -