Saturday, October 25, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ బడుల బలోపేతానికి యువకులు కృషి చేయాలి 

ప్రభుత్వ బడుల బలోపేతానికి యువకులు కృషి చేయాలి 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొర్రా రవి కుమార్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి యువకులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను ప్రజా  ప్రభుత్వము అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొర్రా రవి కుమార్ అన్నారు. శనివారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ప్రశాంత్ నోటుబుక్కులు, ప్యాడ్లు, కంబాక్షలు, ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం అవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని చెప్పారు.

ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈరోజు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులేనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వాడ్యాల్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుమారంజని, ఉపాధ్యాయులు సంతోష్, అనంతరెడ్డి, గ్రామ యువకులు కోల రాము, చిక్కుండ్ర తేజ, విష్ణు బాయ్, నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -