హాస్యనటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అయ్యో ఏమిరా ఈ జీవితం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.
వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘ఇదొక యూత్‌ఫుల్ సాంగ్. రాహుల్ సిప్లిగంజ్ తన స్వరంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడు. వికాస బడిస స్వరాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని అన్నారు.
ఉప్పెన జయకష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్: మార్తండ్.కె.వెంకటేష్, సంగీతం: వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినరు కొట్టి, ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల,నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి.
యూత్‌ఫుల్‌గా ‘అయ్యో ఏమిరా.. ఈ జీవితం’
- Advertisement -
- Advertisement -