Monday, January 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

విషాదం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఆదివారం, నిత్యావసర సరుకుల కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన అభిజిత్‌ దాస్‌(24), బిహార్‌కు చెందిన సుజీత్‌కుమార్‌ ముఖ్య(20) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రషీద్‌గూడ బస్టాప్‌ సమీపంలో వీరి వాహనం చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేక అదుపుతప్పి ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -