Monday, May 26, 2025
Homeజాతీయంయూట్యూబర్ మధుమతి అనుమానాస్పద మృతి

యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ మధుమతి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ. కొండూరు గ్రామానికి చెందిన మధుమతి, చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈమధ్యనే యువతి వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడే ఉరేసుకుని చనిపోయింది. ప్రతాప్ అనే ఓ వివాహితుని వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే మధుమతి మృతికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -