- Advertisement -
- రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్
నవతెలంగాణ-కంఠేశ్వర్: వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవల ఎన్నటికీ మరువలేనివి అని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్ హందన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశ వేణు, పీసీపీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. గుత్ప అలీ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదేనని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడని రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు. విద్యార్థుల చదువుల కోసం స్కూల్ షిప్ లు అందించి ఎంతో మందికి ఉచిత విద్యుత్ అందించాడని,రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన నాయకుడని ఆయన అన్నారు. అదేవిధంగా రామ్ భూపాల్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని,జిల్లాకు ఎత్తిపోతల పథకాలు అందించి సాగు తాగు నీరు అందించాడని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆయన మార్గంలోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మాన్ చైర్మన్ శ్రీనివాస్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్, స్వామి గౌడ్, ముశ్షు పటేల్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -