No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలువైఎస్‌.షర్మిల ఫోన్‌ ట్యాప్‌..?

వైఎస్‌.షర్మిల ఫోన్‌ ట్యాప్‌..?

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్లు ట్యాప్‌ అయినట్లు సమాచారం. ఎపిలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్‌ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోడ్‌ భాషను కూడా ఉపయోగించారని, షర్మిల వాయిస్‌ సంభాషణలను రికార్డు చేయడమే కాకుండా, ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ఆమె సోదరుడి (జగన్‌)కి చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. షర్మిల ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే దానిపై నిశితంగా నిఘా పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, షర్మిలకు సన్నిహితంగా ఉండే కొందరిని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి పిలిపించి హెచ్చరించినట్లు కూడా గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్న విషయాన్ని షర్మిల అప్పట్లోనే పసిగట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆమె వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad