- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. మహానేత ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్‌ఆర్ అమలుచేసిన అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, సీనియర్ నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ఎండీ జాను, చిలుక సంపత్, సాకి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -