- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: టీడీపీ నేతలపై దాడి కేసు సహా, అనేక ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ ఎట్టకేలకు విడుదలయ్యారు. తురకా కిశోర్ ను తక్షణమే విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం తురకా కిశోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటికి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.
- Advertisement -